మెగా, నందమూరి అభిమానులకు బిర్యానీ ఆఫర్ !
- January 10, 2017
పదేళ్ల విరామంతో 150వ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, చరిత్రాత్మక కథనంతో వందో సినిమాతో నందమూరి బాలకృష్ణ తెలుగు వెండితెరకు కొత్త వెలుగులను కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ దశకం తర్వాత తెలుగు వెండితెరను అత్యధిక కాలం ఏలిన ఈ మహా స్టార్లు ఇద్దరూ ఒకేసారి తెలుగు వారికి అత్యంత ప్రియమైన సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, హైదరాబాదులోని ఓ రెస్టారెంట్ మరువలేని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమీర్‌పేటలోని తాలింపు రెస్టారెంట్ ఆ రెండు సినిమాల వీక్షకులకు గొప్ప ఆఫర్ ను ప్రకటిస్తోంది.
చిరంజీవి 150 సినిమా ఖైదీ నెం.150 చూసి ఆ టికెట్ ను తీసుకుని తాలింపు రెస్టారెంటు (అమీర్‌పేట)కు వస్తే వారికి రూ.175 విలువైన బిర్యానీని ఆ సినిమాకు గుర్తుగా 150 రూపాలయకే ఇస్తుంది. అభిమానులకు ఇది అంకితం.
గురువారం విడుదల అవుతున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చూసి వచ్చిన అభిమానులకు 130 రూపాయలు విలువైన సింగిల్ చికెన్ బిర్యానీని బాలయ్య వందో సినిమా గుర్తుగా వంద రూపాయలకే అందిస్తుంది తాలింపు రెస్టారెంటు. ఇది బాలయ్య అభిమానులకు అంకితం.
ఈ ఆఫరును సద్వినియోగం చేసుకోవాలంటే కచ్చితంగా టికెట్ వెంట తీసుకురావాలి. ఆఫరు ఒక టికెట్‌పై ఒక బిర్యానీకే వర్తిస్తుంది.
ఈ సినిమా పండగను తాలింపు ఆఫర్లతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఆఫర్లు సినిమా ప్రేక్షకులకు అంకితం.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







