ఒమన్ లో కార్మిక చట్టం ఉల్లంఘించిన 18 వేల మంది నిర్వాసితులను పట్టివేత..

- January 10, 2017 , by Maagulf
ఒమన్ లో  కార్మిక చట్టం ఉల్లంఘించిన 18 వేల మంది నిర్వాసితులను పట్టివేత..

గత ఏడాది 2016 లో కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి గాను ప్రతివారం 400 మంది నిర్వాసిత కార్మికులను అదుపులోనికి తీసుకొంటున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది కొన్ని వారాల మినహా ఈ గణాంక వివరాలను మంత్రిత్వశాఖ ఎప్పటి కప్పుడు నమోదు చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 2016 లో కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి గాను 18.854 మంది  నిర్వాసిత కార్మికులను ఈ దాడుల సమయంలో పట్టుబడినట్లు తెలిపారు . కార్మిక చట్టాలను  గౌరవించకపోవడం యజమానులకు పరిపాటిగా మారిందని దీనికి తోడు ఈ చట్టాల గూర్చి కార్మికులకు  సైతం సరైనా అవగాహన లేకపోవడం వారికి వరమైంది.  దీనితో పరిస్థితి కార్మిక చట్టాల ఉల్లంఘనకు దారితీసింది.ఒకవేళ యజమాని కనుక కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడక ఉంటె  ఒక కార్మికునికి  అన్ని హక్కులను కాపాడి ఉంటే, అటువంటి సానుకూల పరిస్థితులలో కార్మికులకు  తప్పించుకొనే పరిస్థితులు నమోదు కాబడేవి కాదని  వ్యాపార సంఘం సభ్యుడు మహమ్మద్ ఫేరాజి " మా గల్ఫ్ డాట్ కామ్ " కు  తెలిపారు. ఈ కార్మికులు సరిగా కార్మిక చట్టాన్ని అర్థం చేసుకొని వాటిని అనుసరించండని ఆ విధంగా చేస్తే అప్పుడు కార్మిక చట్టం ఉల్లంఘించినవారిని పట్టుకోవడం మరియు వారిని దేశమునుండి పంపించే అటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేది కాదని ఆ వ్యాపార సంఘం సభ్యుడు వ్యాఖ్యానించాడు.గత ఏడాది మే లో, మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉన్నత  అధికారి ఒకరు దాడులను ఒమన్లో తీవ్రతరం చేయనున్నట్లు ఒక పత్రికా సమావేశంలో సూచనప్రాయగా చెప్పారు.అంతక మునుపు ఏడాది 2015 లో,19,000 మంది నిర్వాసిత కార్మికులు కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి దాడులలో పట్టుబడ్డారు. గత ఏడాది కొన్ని వారాలలో నమోదు కానీ కార్మిక చట్టాల అతిక్రమించిన వారి వివరాలను కనుక నాంధి చేసివుంటే 2016 లో సైతం 19 వేలమంది సంఖ్యను ధాటి ఉండేదని ఆయన పేర్కొన్నారు. మేము తప్పించుకొని తిరిగే నమోదుకాని నిర్వాసిత కార్మికులకు ఒక సలహా ఇస్తున్నామని  కార్మిక చట్టాలు ఉల్లంఘించినవారిని తప్పక పట్టుకొంటామని దానికి బదులుగా మీరే స్వచ్చంధంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖని దయచేసి  సంప్రదించమని వ్యాపార సంఘం సభ్యుడు తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com