'కరుప్పన్'లో జల్లికట్టు వీరుడిగా విజయ్ సేతుపతి
- January 10, 2017
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. సంక్రాంతికి మరికొన్ని రోజులే ఉండటంతో ప్రజలు కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందాని ఎదురుచూస్తున్నారు. కమల్‌హాసన్, సూర్య, హిప్హాప్ తమిళ, శింబు, జీవీ ప్రకాశ్‌లతో పాటు పలువురు జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి త్వరలో ఓ సినిమాలో జల్లికట్టు వీరుడిగా నటించనున్నారు.
'రేణిగుంట' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పన్నీర్‌సెల్వం. ఆయన దర్శకత్వంలోని 'కరుప్పన్' అనే సినిమాలో ప్రస్తుతం విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే ఆయన జల్లికట్టు వీరుడిగా నటిస్తున్నారు. ఈ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. విజయ్ సేతుపతి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







