'కరుప్పన్‌'లో జల్లికట్టు వీరుడిగా విజయ్‌ సేతుపతి

- January 10, 2017 , by Maagulf
'కరుప్పన్‌'లో జల్లికట్టు వీరుడిగా విజయ్‌ సేతుపతి

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. సంక్రాంతికి మరికొన్ని రోజులే ఉండటంతో ప్రజలు కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందాని ఎదురుచూస్తున్నారు. కమల్‌హాసన్‌, సూర్య, హిప్‌హాప్‌ తమిళ, శింబు, జీవీ ప్రకాశ్‌లతో పాటు పలువురు జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్‌ సేతుపతి త్వరలో ఓ సినిమాలో జల్లికట్టు వీరుడిగా నటించనున్నారు.

'రేణిగుంట' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పన్నీర్‌సెల్వం. ఆయన దర్శకత్వంలోని 'కరుప్పన్‌' అనే సినిమాలో ప్రస్తుతం విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే ఆయన జల్లికట్టు వీరుడిగా నటిస్తున్నారు. ఈ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. విజయ్‌ సేతుపతి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com