దిల్లీ వెళ్లిన కేటీఆర్‌

- January 11, 2017 , by Maagulf
దిల్లీ వెళ్లిన కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం దేశరాజధాని హస్తినలో సుడిగాలి పర్యటన చేసింది. తెలంగాణలో పౌర విమానయాన విస్తరణకు, ఆదిలాబాద్‌లో ఏకైక సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణతో పాటు పలు కీలక సమస్యల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ దిల్లీలో పలువురు కేంద్రమంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని కలిశారు. ప్రాంతీయ విమానయాన అనుసంధానంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏకైక సిమెంట్‌ పరిశ్రమను పునరుద్ధరిచాలని తెలంగాణ అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత గీతేతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. సిమెంట్‌ పరిశ్రమ మూతపడటం వల్ల వందలాది మంది కార్మికులు అవస్థలెదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసిన కేటీఆర్‌ బృందం మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సహకారమందించాలని కోరింది. అనంతరం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో సహా పలువురు ముఖ్యులతో భేటీ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com