ఐఆర్‌సీటీసీ భారత్‌ దర్శన్‌ యాత్ర..

- January 11, 2017 , by Maagulf
ఐఆర్‌సీటీసీ భారత్‌ దర్శన్‌ యాత్ర..

 'భారత్‌ దర్శన్‌' పేరుతో ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో హైద్రాబాద్‌ నుంచి కొచ్చిన్‌కు విమాన యాత్ర ప్రవేశపెడుతున్నట్టు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు. సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్‌ శంషాబాద్‌ నుంచి కొచ్చిన్‌కు విమాన యాత్ర మొదటి ట్రిప్‌ ఫిబ్రవరిలో, రెండో ట్రిప్‌ మార్చిలో యాత్ర కొనసాగుతుందన్నారు. మొదటి ట్రిప్‌ : 
హైద్రాబాద్‌ శంషాబాద్‌ నుంచి ఫిబ్రవరి 23న ఉదయం 8.55 గంటలకు బయల్దేరి 10.25కు కొచ్చిన్‌కు చేరుకుంటుంది.
కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టుల నుంచి ఫిబ్రవరి 29న రాత్రి 9. 25 గంటలకు బయల్దేరి హైద్రాబాద్‌కు రాత్రి 10.25కు చేరుకుంటుంది.
రెండో ట్రిప్‌ : 
హైద్రాబాద్‌ శంషాబాద్‌ నుంచి మార్చి 10న ఉదయం 8.55 గంటలకు బయల్దేరుతుంది.
కొచ్చిన్‌ నుంచి హైద్రాబాద్‌కు మార్చి 16న రాత్రి 9.25 గంటలకు బయల్దేరి హైద్రాబాద్‌కు 10.25కు చేరుకుంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు:
ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్న విమాన యాత్రలో భాగంగా ఎర్నాకులం, మున్నూర్‌, టెక్కడి, కుమర్‌కుం, కొచ్చిన్‌, శ్రీనగర్‌, గోవా మీర్‌మార్‌ బీచ్‌, పాత గోవా బీచ్‌, మంగీషా దేవాలయం, దోనాపౌలా బీచ్‌, ఆగుడా, కండోలిం బీచ్‌, బాగా బీచ్‌వంటి ప్రదేశాలను చూడొచ్చు.
చార్జీల వివరాలు: 
ఒక్కరికి -రూ.

23,328 - 00 
ఇద్దరికి - రూ. 18,404 - 00 
ముగ్గురికి -రూ. 18124 - 00 
చిన్నపిల్లలు - 2 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసువారికి రూ. 17,672 చార్జీలు వసూలు చేస్తారు. 
వివరాల కోసం ఐఆర్‌సీటీసీ 040-27702407/ 27800580, బేగంపేట్‌ ఫోన్‌ నెంబరు - 040 23400606 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com