డాక్టర్లు, నర్సులకు పింక్ క్యారవాన్ పిలుపు
- January 12, 2017షార్జా: బ్రెస్ట్ క్యాన్సెర్ అవేర్నెస్ ఇనీషియేటివ్ 'పింక్ కారవాన్', రెసిడెంట్ డాక్టర్లు మరియు నర్సులు 7వ యాన్యువల్ రైడ్‌లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తోంది. ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సెర్ పేషెంట్స్‌తో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని 'సెవెన్ ఇయర్స్ ఫర్ సెవెన్ ఎమిరేట్స్' పేరుతో మార్చ్ 7న షార్జాలో ప్రారంభిస్తారు. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. జనరల్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ మరియు రేడియాలజీ, ప్లస్ ఎక్స్‌రే టెక్నీషియన్లు మరియు నర్సులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికీ ఈ కారవాన్ ఉపయోగపడ్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ క్లీనిక్స్‌లో 500 నుంచి 1000 దిర్హామ్‌లు ఖర్చయ్యే పరీక్షల్ని పింక్ కారవాన్ రైడ్‌లో ఉచితంగా నిర్వహిస్తారు. గత ఆరేళ్ళుగా పింక్ కారవాన్ రైడ్ విజయవంతంగా కొనసాగుతూ, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు