మోసుల్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్న ఇరాక్ దళాలు

- January 14, 2017 , by Maagulf
మోసుల్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్న ఇరాక్ దళాలు

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న మోసుల్‌ యూనివర్సిటీని ఇరాక్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్‌ నగరాన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు గత అక్టోబర్‌ నుంచి ప్రయత్నిస్తోన్న ఇరాక్‌ బలగాలు.. తాజాగా యూనవర్సిటీని చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇన్నాళ్లూ యూనివర్సిటీలోని ప్రయోగశాలల్లో ఐఎస్‌ ఉగ్రవాదులు కెమికల్‌ ఆయుధాలు తయారు చేసేవారని.. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఇరాక్‌ భద్రతా అధికారి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com