దుబాయ్ రషీద్ ఆసుపత్రిలో తొలి రోబో ఫార్మసీ
- January 14, 2017
రోబోల యుగం వచ్చేసింది. ప్రతి పనికీ సులువుగా ఉపయోగించే విధంగా రోబోలను తయారుచేసి విపణిలోకి విడుదల చేస్తున్నారు. వివిధ దేశాల్లో సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి బ్యాంకు కార్యకలాపాలు చూసే వరకు రోబోలను ఉపయోగిస్తున్నారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ) తొలిసారిగా రోబోతో ఔషధ దుకాణాన్ని ఏర్పాటు చేయనుంది. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో రోబో ఔషధ దుకాణం సేవలందించనుంది. రోగులకు వైద్యులు సూచించిన మందులను ఇకపై రోబో వారికి అందిస్తుంది. ఆదివారం నుంచి ఈ రోబో ఔషధ దుకాణం అందుబాటులోకి రానుంది.వైద్యులు సూచించిన మందుల చిటీ మీద ఉండే బార్కోడ్ ఆధారంగా ఎటువంటి లోపాలు లేకుండా ఖచ్చితంగా అవే మందులను రోబో ఇస్తుంది.
దీని వల్ల మందుల పంపిణీలో ఒక్కోసారి వ్యక్తులు చేసే తప్పులను సరిచేసుకోవచ్చని యూఏఈ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రోబో ఫార్మసీలో దాదాపు 35వేల మందులు నిల్వ ఉంటాయి. నిమిషం కంటే తక్కువ సమయంలో దాదాపు 12 మందుల చిటీలకు మందులు అందిస్తుంది. దీని వల్ల వినియోగదారులు మందులు కొనుగోలు చేసుకునేందుకు వేచి ఉండే సమయం తగ్గిపోతుంది.
దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ రోబో సదుపాయాన్ని అన్ని ఆసుపత్రుల్లోకి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధునాతన సాంకేతికను ఉపయోగించుకొని సంతోషకరమైన, ఆరోగ్యమైన సమాజాన్ని రూపొందించుకునేందుకు డీహెచ్ఏ ఈ ఆలోచనను చేసింది. ఇప్పటికే యూఏఈలోని పలు ప్రాంతాల్లో రోబో సర్వీసులు ఉన్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రోబోలు ప్రయాణికులకు సాదర స్వాగతం పలకడం, మానవరహిత కారు ప్రయోగం.. ఇటువంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు దుబాయ్ వేదికైంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







