'సెల్ఫ్ అసెంబ్లీ' సాయంతో అత్యంత దృఢమైన 'అణు బంధం'
- January 15, 2017
అణువుల మధ్య అత్యంత దృఢమైన బంధాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటుచేశారు. దీంతో చాలా గట్టి, ఎలా కావాలంటే అలా ఉపయోగించగలిగే పదార్థాలకు మార్గం సుగమమైంది. బ్రిటన్‌లోని మాంచెస్టర్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. భిన్న స్థాయిల్లో అణువులు పటిష్ఠ బంధాలను ఏర్పరచుకోగలిగే ఓ విధానాన్ని వారు అభివృద్ధిచేశారు. దీన్ని అనుసరించి 192 అణువులతో దృఢమైన వలయాన్ని ఏర్పరిచారు. 20 నానోమీటర్ల పొడవున్న దీనిలో ఎనిమిది క్రాసింగ్స్ ఉన్నాయి. 'అణువుల మధ్య బంధాలు ఏర్పరచడం మగ్గం నేయడం లాంటిదే. తాజా విధానంలో అణువుల పోగులఅన్నీ బంధంలో పాల్గొనేలా చూశాం. ఇప్పటివరకూ ఉన్నవాటిన్నింటిలోనూ ఇదే అత్యంత దృఢ, సంక్లిష్టమైన అణు బంధం'అని పరిశోధకులు డేవిడ్ లీగ్ వివరించారు. 'సెల్ఫ్ అసెంబ్లీ'గా పిలిచే సాంకేతికత సాయంతో ఈ బంధాన్ని సాకారం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







