షార్జా లో 400 మిలియన్ దిర్హామ్స్ వ్యయంతో నిర్మించిన ఆధునిక సాంకేతిక జైలు
- January 16, 2017
షార్జా: మొదటి దశలో 400 మిలియన్ దిర్హామ్స్ ల వ్యయం గల సెంట్రల్ జైలు ఆదివారం షార్జాలో ప్రారంభించబడింది. శిక్షాత్మక మరియు పునరావాస ఏర్పాటుతో అధికారులు, ఖైదీలకు మరియు ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ఆధునిక సాంకేతికను ఈ నిర్మాణంలో అమర్చారని అధికారులు తెలిపారు. షార్జా లోని అల్ రాందాస్ ప్రాంతంలో ఉన్న ఈ జైలులో 3,000 మంది ఖైదీలు పూర్తిగా కార్యాచరణగా ఉండేందుకు అనువుగా నిర్మించారు.17,000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ జైలులో పురుషులు మరియు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తుల నియంత్రణ గది మరియు సందర్శకుల కోసం వసతి ఉంటుంది. కంట్రోల్ రూమ్ ప్రాంతంలో మొదటి రకమైన నిఘా కెమెరాలతో పాటు అదనంగా "విశ్లేషణాత్మక" కెమెరాలు అమర్చారు.అన్ని ద్వారాలను మరియు తాళాలను కేంద్ర నియంత్రణ గది నుండి నిర్వహించబడుతున్నాయి. పురుషుల జైలు కింద అంతుస్తు మరియు రెండు అంతస్తులతో కలిపి మొత్తం మూడు అంతస్తులు కల్గి ఉంది. రెండు విభాగములలో 16 గదులు మరియు 20 పడకలు, భోజనం చేసే స్థలం, ప్రార్థన గది, విశ్రాంతి గది, గ్రంథాలయం మరియు ఒక కార్ఖానా ఉన్నాయి. క్రొత్త జైలు నిర్మించిన ప్రాంతంలో గతంలో పాత జైలు ఉండేది దానిని 1981 లో నిర్మించారు అందులో 2,000 మంది ఖైదీలు గరిష్టంగా ఉండేవారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో నిర్మించబడుతున్న నూతన ప్రాజెక్టు మొదటి దశకు పూర్తికావడంతో1,000 మందికి పైగా ఖైదీలను కొత్త జైలులో వసతి ఇవ్వగలదు. నూతన జైలు మొదటి దశ ప్రారంభోత్సవంకు షార్జా శిక్షాత్మక స్థాపనల విభాగ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా అల్ మెర్రి, మరియు పలువురు పోలీసు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







