యూ. ఏ. ఈ లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న దగ్గు మందు ద్రావణం స్వాధీనం
- September 12, 2015
యూ. ఏ. ఈ. లోని యూ. ఏ. క్యు. లోని కొన్ని సూపర్ మార్కెట్లు మరియు దుఖానాలలో అవసరమైన లైసెన్సులు పేర్మిషన్లు లేకుండానే విక్రయిస్తున్న దగ్గు మందు ద్రావణాన్ని ప్రజారోగ్యానికి ప్రమాదం సంభవించే ప్రమాదం ఉన్నందున స్వాధీనం చేసుకున్నామని ఉమ్మ్ అల్ క్వాయిన్ ఆర్ధికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రకటించారు. శాఖ యొక్క ఇనస్పెక్షన్ సెక్షన్ హెడ్ సైఫ్ సలెమ్, దుఖానం వారు ఔషధాలను ఎలా తీసుకోవాలో, ఎంత పరిమాణంలో తీసుకోవాలో కూడా నిర్దే శిస్తున్నట్టు ఏ విధమైన వైద్య శిక్షణ కానీ, వానివల్ల సంభవించే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈ విధమైన అవగాహన లేకుండానే, ఇంకా యూ. ఏ. ఈ. నియమాల ప్రకారం ఈ ఔషధాలపై అందులో ఉన్న మిశ్రమాలు కానీ పదార్ధాలు కానీ అరబిక్ భాషలో ముద్రించబడలేదని ఆయన తెలియజేశారు. ఈ విధంగా నిబంధనలను అతిక్రమించి, న్యాయాన్యాయాలు ఆలోచించకుండా,ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా, కేవలం లాభాపేక్ష మాత్రమే గల వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెల్పారు. ఇకపై, ముఖ్యంగా ఆహార పదార్ధాల దుఖానాలు అన్ని నిబంధనలు పాటించేలా పర్యవేక్షిస్తామని, గతంలో పెద్ద సంఖ్యలో ఉపయోగించ పనికిరాని ఆహారాన్ని, నూనెలను ఇంకా పరిమళాలను జప్తు చేశామని హామీఇచ్చారు. ఏదైన నిబంధనల అతిక్రమణను గమనించినట్టైతే, షేక్ అహ్మెద్ అల్ ముల్లా రోడ్డు లోని తమ కార్యాలయం, లేదా మెయిల్ - [email protected], లేదా మొబైల్ నంబర్లు 050-1583999, 06-765220 లేదా ఫ్యాక్స్ నంబరు 06-7653322 ల వద్ద సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







