హమాద్ మెడికల్ సిటీ, ఉమ్ సలాల్ హెల్త్ సెంటర్‌ని సందర్శించిన ఎమిర్..
- January 18, 2017
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, పలు హెల్త్ సెంటర్స్‌ని హమాద్ మెడికల్ సిటీలో సందర్శించారు. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల డెవలప్‌మెంట్‌ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. దేశ అవసరాలకు తగ్గట్టుగా మెడికల్ సిస్టమ్ అందుబాటులో ఉండాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఖతార్ రిహాబిలిటేషన్ సెంటర్‌ని కూడా ఈ సందర్బంగా ఆయన సందర్శించడం జరిగింది. విమెన్స్ వెల్‌నెస్ మరియు రీసెర్చ్ సెంటర్ అలాగే, ఇంటిగ్రేటెడ్ సర్జరీ సెంటర్స్‌లో పలు విభాగాల్ని ఆయన తిలకించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ బిల్డింగ్ తదితర విభాగాల్ని పరిశీలించారాయన. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనాన్ మొహమ్మద్ అల్ కువారి, ఎమిర్ షేక్‌కి వివిధ విభాగాల గురించి వివరంగా తెలియజేశారు. ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్‌కి చెందిన హెల్త్ సెంటర్‌ని కూడా ఎమిర్ షేక్ సందర్శించడం జరిగింది. ఫ్యామిలీ మెడిసిన్ క్లినిక్స్, వెల్ బేబీ క్లినిక్స్, వ్యాక్సినేషన్స్, డెంటల్ క్లీనిక్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమిర్ షేక్.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







