ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ--కువైట్
- January 19, 2017

ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్ లో ఏ కార్యక్రమం నిర్వహించినా మరే ఇతర రాజకీయ పార్టీ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నిర్వహించలేని విధంగా వినూత్న పద్ధతిలో భారీ ఎత్తున తెలుగు దేశం పార్టీ అభిమానుల ప్రోత్సాహంతో, కార్యకర్తల అండదండలతో కార్యక్రమలను నిర్వహిస్తూ వస్తున్నది. కువైట్ లోని ప్రవాసులనందరినీ కలుపుకుపోతూ వారికి సేవనందించడమే లక్ష్యంగా పలు సాంఘిక కార్యక్రమాలను చేపడుతూ, ప్రవాసుల మన్ననలను అందుకుంటున్నది కువైట్ ప్రవాసాంధ్ర తెలుగు దేశం.కు గల్ఫ్ దేశాలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛంధంగా రక్తదానం చేసారు.కువైట్‌లో ములకల సుబ్బరాయుడు నేతృత్వంలోని ప్రవాసాంధ్ర టీడీపీ కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ పార్టి డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి జనవరి 18, సందర్భంగా, జనవరి 14, 2017 న జాబ్రియా బ్లడ్ బ్యాంకు సాయంత్రం 3 గంటలనుండి సాయంత్రం 5.30 నిముషముల వరకు రక్తదన శిబిరం నిర్వహించింది.ఈ కార్యక్రమానికి విశేషంగా ఎంతోమంది తెలుగు ప్రవాసులు స్పందించారు. అదే స్ఫూర్తితో జనవరి 18 అనగా ఈరోజు రాత్రి 8 గంటలనుండి 9.30 వరకు యూనిటీ సెంటర్, ఎం బి టి సి క్యాంపు బేస్మెంట్ ఆసియ సూపర్ మార్కెట్ వెనుక, 48 స్ట్రీట్, ఫహాహీల్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కువైట్ లో ఉన్న ప్రవాస తెలుగు సమాజం అందరు కలిసి నివాళులు అర్పించారు ఘన నివాళి ప్రారంభ ఉపన్యాసం వై బాలకృష్ణ చేయగా అధ్యక్షోపన్యాసం ఎం సుబ్బారాయుడు గారు పిదప వరసగా సభ్యులు శ్రీ నాగేంద్ర,రాజశేఖర్ చప్పిడి, కే వెంకటేశ్వర్లు నాయుడు, నాగేశ్వర్ రావు, ఫణి పాతూరి, నారాయణమ్మ.పి,శ్రీనివాస్ చంద్ర,వెంకట్ కోడూరు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పిస్తూ ఉపన్యసించారు.
వీరందరి ఉపన్యాసాలలో ఎన్టీఆర్ జీవనశైలీ వారి రాజకీయ ప్రస్థానం గురించి మననం చేసుకోడవడం, చంద్రబాబు నాయుడి పరిపాలన దక్షత గురించి ఒకసారి గుర్తు చేసుకున్నారు.
ఉపన్యాసాలలో కొన్ని ముఖ్య అంశాలు.
ఎన్టీఆర్ కృష్ణ అవతారంగా అఖిలాంద్ర ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. మూడు దశాబ్దాల పాటు ఒకే పాత్రను వయస్సుతో నిమిత్తం లేకుండా పోషించి మెప్పించగలిగారు. అంతేకాదు తన కొడుకు పెద్ద పోలీసాఫీసరు కావాలని అనుకున్నారంట ఎన్టీఆర్ తల్లి వెంకట్రావమ్మ. యాదృచ్చికంగా ఎన్టీఆర్ తన సినీ నటనా జీవితాన్ని పోలీసు పాత్రతోనే మొదలు పెట్టారు. అలా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడయ్యేందుకు తల్లి శుభాశీస్సులు, శుభకామనలు సదా ఆయన వెంటే నిలిచాయి.
అందుకేనేమో ఎన్టీఆర్ కు మహిళలంటే అమితమైన గౌరవాభిమానాలుండేవి. సమాజంలో ఇంచుమించు సగం మంది స్త్రీలు ఉన్నా వారి సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం జరగవలసిన కృషి జరగలేదని ఆయన బాధపడుతుండేవారు. అర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడినప్పుడే, రాజకీయ, సామాజిక రంగాలలో పురుషుడి సరసన ధీటుగా నిలబడి స్త్రీ పురోగమించగలుగుతుందని ఎన్టీఆర్ భావించారు. స్త్రీలకు సమాన గౌరవ మర్యాదలుగల హోదాను అనుభవించడానికి వీలుగా అనేక రకాల కార్యక్రమాలకు, చట్టాలకు ఎన్టీఆర్ పాలనలోనే బీజం పడింది. ఆయనని అందరూ N.T.R అని పిలుస్తారు తన పార్టీ కార్యకర్తలతో రామారావు, ఎన్.టి.ఆర్, అతని అభిమానులకు పేదల పెన్నిధి, లేదా అన్నగారు ఒక నటుడు, దర్శకుడు, నిర్మాత, ఇలా పలురకాలుగా పిలిపించుకుంటూ అన్ని రంగాలలో రాణించారు, ఒక తెలుగుదేశం పార్టీలో ఏడు సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి పేదవారి మరియు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. అలాగే ఆయన వారసుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగా అంతర్ముఖుడు అంటే లోతు మనిషి.కాని వ్యవహారాల విషయంలో సంఘజీవి. ఎప్పూడూ పది మందిని పోగేసుకుని ఏదో ఒక బృహత్ప్ర్రయత్నం మొదలు పెట్టడం ఆయన వ్యాపకం. అల్లుకుపోవడం ఆయన స్వభావం. రాజ్యం వీరభోజ్యం తనదైన శైలీతో అమరావతిని నిర్మించడంలో అపర విశ్వకర్మ అయ్యాడు అంటూ అటు ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పిస్తూ ఇటు ముఖ్యమంత్రి చందరబాబు నాయుడు వ్యవహారశైలిని కొనియాడారు ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్ అధ్యక్షులు, సభ్యులు.
వీరందరి ఘన నివాళి అనంతరం సెక్రెటరీ ఉదయ్ ప్రకాష్ కార్యక్రమాన్ని ముగిస్తూ హాజరయిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.



తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







