హజ్ యాత్రలో ఇద్దరు తెలుగు వారి గల్లంతు

- September 13, 2015 , by Maagulf
హజ్ యాత్రలో ఇద్దరు తెలుగు వారి గల్లంతు

హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా : హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com