జల్లికట్టు కి ఓకే చెప్పిన కేంద్రం.!
- January 20, 2017
తమిళులు పోరాటం ఫలించింది. జల్లికట్టు కు కేంద్రం జై కొట్టింది. తమిళులు ఉద్యమానికి కేంద్రం తలోగ్గింది. తమిళనాడు సర్కార్ పంపిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మెరీనా బీచ్ వద్ద వేలాది మంది తమిళులు సంబరాలు జరుపుకుంటున్నారు. జల్లికట్టు లక్ష్యంగా తమిళులు ఏ పార్టీకి సంబంధం లేకుండా యవతరమే స్వచ్ఛందంగా ముందుకు కదిలింది. వీరికి అన్ని తమిళ వర్గాలు మద్దతు పలుకాయి. దాంతో ఉద్యమం తాడోపెడో అనే స్థాయికి చేరింది. ద్రవిడ సంస్కృతిలో జలకట్టుకు వేల ఏళ్ల చరిత్రి ఉంది. దాదాపు 3500 ఏళ్ల కిందట తమిళనాడులో జల్లికట్టు జరిగిందనడానికి ఆధారాలు లభ్యమయ్యాయి. నీలగిరి జిల్లాలో కరిక్యూర్ అనే గ్రామం వద్ద తవ్వకాల్లో లభ్యమైన శిలాపలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు ఉన్నాయి.
ఇవి 3500 ఏళ్ల నాటివి అని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అలాంటి జల్లికట్టును ఇప్పుడు నిషేధిత క్రీడగా ప్రకటించడంపై తమిళ సమాజం మండిపడుతోంది. ప్రతి ఒక్కరిలోను తమ సంస్కృతి, సంప్రదాయాలను తమకు కాకుండా చేస్తున్నారనే భావన తమిళుల్లో పెరిగిపోయింది. ఫలితంగా జల్లికట్టను కాపాడుకోవాలనే భావనలో యువతరం ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







