గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ హెచ్చరిక
- January 20, 2017
ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. 10 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో గుర్తుతెలియని ముజాహిదీన్ కమాండర్ రెండు ఏకే-47 తుపాకులు పట్టుకొని మాట్లాడాడు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయనాయకులు ఎటువంటి భద్రత లేకుండా 15 నిమిషాల పాటు ఇల్లు లేదా స్వస్థలాల్లో ఉండండంటూ సవాలు విసిరారు. మొసలి కన్నీళ్లు కార్చడం ఆపండి అంటూ హెచ్చరించారు. దేశమంతా మీ వెంట ఉందని మీరు భావిస్తే భద్రత లేకుండా పదిహేను నిమిషాలు ఉండండి.
అప్పుడు తెలుస్తుంది దేశం మిలిటెంట్ల వైపు ఉందనే విషయం.. అని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని గతేడాది భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో జమ్ముకశ్మీర్ అంతా అల్లర్లు చెలరేగాయి. దాదాపు ఐదు నెలల పాటు సాగిన ఈ ఘర్షణల్లో పలువురు సాధారణ పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







