హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...

- January 21, 2017 , by Maagulf
హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...

హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి ధూల్ పేటలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను, నిబంధనలకు విరుధ్దంగా ఉన్న భవనాలను  జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారుల పై మండిపడుతున్నారు. కూల్చివేతకు నిరసన తెలుపుతూ స్థానికులు అక్కడ గుమిగూడారు. పరిస్థితి చేయిదాటడంతో జీహెచ్ ఎంసీ అధికారులు పోలీసులను రప్పించారు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ ప్రాణాలు పోయినా సరే... తమ ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, అక్కడి వాతావరణం హీటెక్కింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com