మమ్ముట్టి ట్రాన్స్ సెక్సువల్ అంజలి అమీర్ తో...

- January 22, 2017 , by Maagulf
మమ్ముట్టి ట్రాన్స్ సెక్సువల్ అంజలి అమీర్ తో...

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ట్రాన్స్ సెక్సువల్ అంజలి అమీర్ తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే మోడల్ గా మంచి గుర్తింపు పొందిన అంజలి అమీర్‌కు 'పేరంబు' తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన అంజలి అమీర్‌ నటిస్తోంది. పేరంబు సినిమాలో అంజలి అమీర్ తన కోస్టార్ అంటూ స్వయంగా మమ్ముట్టి ట్వీట్ చేశారు.
కాగా, మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటోంది అంజలి. ఆయన ప్రోత్సాహం మరువలేనిదని చెప్పుకొచ్చింది. మమ్ముట్టి చాలా గ్యాప్‌ తరువాత చేస్తున్న ఈ కోలీవుడ్‌ మూవీకి తంగమీన్‌గళ్‌ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన రామ్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com