ఈ- టాయిలెట్లు..నేడు ప్రారంభం హైదరాబాద్ చార్మినార్ వద్ద...
- January 26, 2017
త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
నిర్వహణ అవసరం లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఎలక్ర్టానిక్ టాయిలెట్లు నగరంలో అందుబాటు లోకి రానున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో టాయిలెట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 109 టాయిలెట్లు ఏర్పాటుచేశామని అధికారులు చెబుతున్నారు. వీటికి కొనసాగింపుగా పర్యాటక ప్రాంతా ల్లో సందర్శకులను ఆకర్షించేలా సరికొత్త మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. వివిధ కార్పొరేట్, బ్యాంకింగ్ సంస్థలు సామాజిక బాధ్యతగా ఈ- టాయి లెట్లను అందించేందుకు ముందుకొస్తున్నాయి.
ఎస్బీ హెచ్, హడ్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కిమ్స్, తెలంగాణ స్టేట్ ఎపెక్స్ కో ఆపరేటివ్ బ్యాంక్‌తో పాటు పలు సంస్థలు వ్యయాన్ని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని కమిషనర్ డాక్టర్ బీ.జనార్దన్‌రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై తరహాలో ఎలక్ర్టానిక్ టాయిలెట్లను శుక్రవారం చార్మినార్ వద్ద మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించ నున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఈ-టాయి లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం దశలవారీగా ఇతర పర్యాటక ప్రాంతాలు, ప్రధానకూడళ్లకు విస్తరిస్తా మని జనార్దన్‌రెడ్డి చెప్పారు. రెండేళ్ల పాటు టాయిలెట్ల నిర్వహణను ఆయా సంస్థలే చూసుకుంటాయి. బెంగ ళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి నిర్వ హణను ఆన్లైన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు.
ఇవీ ప్రత్యేకతలు...
ఫ కాయిన్ వేయగానే టాయిలెట్ డోర్ తెరుచు కుంటుంది. ఆటోమేటిక్‌గా లైట్లు వెలుగుతాయి. డబ్బు వసూలు చేసేందుకు వ్యక్తులు అవసరం లేదు.
ఫ ఆడియో కమాండ్స్ టాయిలెట్‌ను ఎలా వినియో గించుకోవాలనే దానికి సంబంధించి సూచనలు చేస్తాయి.
ఫ టాయిలెట్‌ను మూడు నిమిషాల పాటు విని యోగిస్తే 1.5 లీటర్ల నీటితో దానంతట అదే శుభ్ర మవుతుంది.
ఫ మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం వినియోగించిన పక్షంలో 4.5 లీటర్ల నీటితో శుభ్ర మవుతుంది.
ఫ ఎలక్ర్టానిక్ టాయిలెట్‌లోని ప్లాట్‌ఫామ్ అంతా ప్రతి 5, 10 మంది వినియోగించుకున్న అనంతరం ఆటో మేటిక్‌గా శుభ్రమవుతుంది.
ఫ ఇవన్నీ జరిగేందుకు ప్రత్యేకంగా ప్రోగామింగ్ చేస్తారు. సషబి=చ
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







