ట్రంప్ టీంలో మరో భారతీయుడు...

- January 27, 2017 , by Maagulf
ట్రంప్ టీంలో మరో భారతీయుడు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్ లో మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి అవకాశం దక్కింది. ట్రంప్ ప్రత్యేక సలహాదారుగా న్యాయవాది.. ఉత్తమ్‌ ధిలాన్ ను నియమించారు. న్యాయం,  నైతికతకు సంబంధించిన విషయాల్లో ఆయన ట్రంప్‌కి సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రస్తుతం ఉత్తమ్ ధిలాన్.. హౌస్‌ బ్యాంకింగ్‌ కమిటీలో చీఫ్‌ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు  కౌంటర్‌ నార్కోటిక్స్‌ ఎన్ ఫోర్స్‌మెంట్‌ విభాగంలో హోంలాండ్‌ సెక్యూరిటీ ఆఫీస్‌లో చీఫ్‌గా పనిచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com