సముద్రంలో బోల్తా పడిన ట్రక్కు గల్లంతైన ఆసియా దేశ డ్రైవర్
- January 28, 2017
రాస్ అల్ ఖైమా: ఇరవై ఏళ్ళ వయస్సు గల ఆసియా దేశానికి చెందిన ఒక డ్రైవర్ ఎమిరేట్ లోని రాస్ అల్ ఖైమాహ్ ఓడరేవులలో సరుకులు నింపే మార్గంపై ట్రక్కుని నడుపుతూ అకస్మాతుగా బాట తప్పి వాహనంతో సహా సముద్ర జలాల్లో పడి మునిగి చనిపోయాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సరుకులు నింపిన కార్గో పెట్టెలను ట్రక్కులో ఎక్కించుకొని తిరిగివస్తున్న సమయంలో ఓడ వద్దకు వెళ్లే మార్గం ఓ భాగం విచ్ఛిన్నమై ట్రక్కు అమాంతంగా సముద్రంలోకి ఒరిగిపోయిందని వివరించారు.
"భారీ ట్రక్ కిందకు జారీ పడటం ఆపై స్టీరింగ్ చక్రం మధ్య బాధితుడు లోపల ఇరుక్కుపోయి సముద్రంలోనే తుది శ్వాస విడిచినట్లు షామ్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐడి శాఖ అధిపతి మొదటి లెఫ్టినెంట్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి చెప్పారు.కాగా,ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి పేరు ఎస్ ఎ కె గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ ని వెలుపలకు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు , కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆ డ్రైవర్ అత్యంత విషాదంగా తన ప్రాణాలు పోగొట్టుకొన్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







