టెక్సాస్‌లో ప్రార్ధనా స్థలానికి నిప్పు!...
- January 28, 2017
టెక్సాస్, జనవరి 28: ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే టెక్సాస్‌లోని ఓ ఇస్లాం ప్రార్ధనా స్థలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టారు. శనివారం తెల్లవారుజామున విక్టోరియాలోని ఈ ప్రార్ధనా స్థలం మంటల్లో కాలిబూడిదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ ముస్లిం, ఇస్లామిక్ సంస్థలపై దాడులు పెరిగాయి. ఇటీవలే ఈ ప్రార్ధనా సం్థలంలో దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ముస్లింలపై నిషేధ నిర్ణయం వెల్లడించిన కొన్ని గంటల్లోనే భారీ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం వెనుక కారణాలు ఇప్పటికిప్పుడు తెలియకున్నా.. ఎవరో కావాలనే నిప్పుబెట్టి ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







