ఐటీ సోదాలు నితిన్ ఇంట్లో...
- January 31, 2017టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫ్యామిలీపై ఐటీ డేగకన్ను వేసింది. నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు రైడ్స్ చేశారు. మంగళవారం ఉదయం ఐటీ టీమ్స్ జూబ్లీహిల్స్‌లోని నితిన్, సుధాకర్‌రెడ్డి ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల రిలీజైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నైజాం రైట్స్‌ని సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.
శాతకర్ణికి సంబంధించిన జమా ఖర్చులపై వివరాల సేకరణకే ఈ సోదాలు జరిగినట్టు ఇన్సైడ్ సమాచారం. టాలీవుడ్లో లీడింగ్ ప్రొడ్యూసర్, డిస్ర్టిబ్యూటర్‌గా చెలామణి అవుతున్న సుధాకర్‌రెడ్డి, గ్లోబల్ ఫిల్మ్స్, ఏషియన్ సినిమాస్ లాంటి డిస్ర్టిబ్యూషన్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు.
మరోవైపు నితిన్‌తోపాటు శాతకర్ణి మేకర్స్ ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో శాతకర్ణి మూవీని నిర్మించిన మేకర్స్, ఎంత వసూళ్లు సాధించిందన్న విషయాన్ని ఎక్కడ ప్రకటించలేదు. దీంతో కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హంగామా చేశాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులకు అనుమానం వచ్చి దాడులు చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నమాట.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్