మిలియనీర్‌గా మారిన స్టోర్ కీపర్
- February 01, 2017
ఇండియన్ స్టోర్ కీపర్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్స్ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తీసిన డ్రాలో ఆయనకు 1 మిలియన్ డాలర్ల బహుమతి లభించింది. ఆయన పేరు అజెష్ పద్మనాభం. షార్జాలో నివసిస్తారీయన. మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కార్యక్రమంలో అజెష్ రెగ్యులర్ పార్టిసిపెంట్. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. అజెష్, ఫెడరల్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీలో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలిపారాయన. కాగా, డానీ జెహ్రా కూడా మరో బహుమతిని గెలుచుకున్నారు. డానీ జెహ్రా లెబనీస్ దేశానికి చెందినవారు. తన కుమార్తె పేరు మీద తీసిన టిక్కెట్‌కి ఆస్టన్ మార్టిన్ వింటేజ్ స్పోర్ట్ షిఫ్ట్ గెలుపొందారు. జహా కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నేపాల్‌కి చెందిన ప్రజ్వల్ రాజ్ పౌడెల్, డుకాటీ మాన్‌స్టర్ బైక్‌ని గెలుపొందారు. 2016 డిసెంబర్ 20న తొలి బైక్‌ని ఆయన గెలుపొందడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









