సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ'
- February 01, 2017
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది..
ఇప్పటికే ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ , కొద్దీ సేపటి క్రితం చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూడడం జరిగింది..సెన్సార్ చేసిన సభ్యులు సినిమాకు క్లిన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమాలో నాగార్జున నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పారు.
అలాగే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం అద్భుతమని అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలోనే ప్రేక్షకులకు నచ్చుతుందని సెన్సార్ చెప్పడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. అక్కినేని నాగార్జున హాథీరామ్ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









