టెక్నీషియన్ల కోసం మున్సిపల్ కౌన్సిల్ ఐడీ కార్డ్స్
- February 01, 2017
మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ (మదల్సా), ప్రొఫెషనల్ ఐడెంటిటీ బ్యాడ్జెస్‌ని స్కిల్డ్ వర్కర్స్ మరియు టెక్నీషియన్స్‌కి అందించే విషయమై సమాలోచనలు చేయనుంది. సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ (సిఎంసి) ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఐడీ కార్డులు అనేవి, ప్రస్తుతం ఈ రంగంలో నిర్వహిస్తున్న స్పెషలైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ పరీక్షల తర్వాత మంజూరు చేయబడ్తాయి. ఫ్రీలాన్సర్స్, కంపెనీ ఎంప్లాయిస్‌కి ఈ తరహా ఐడీ కార్డులు ఇవ్వడం ద్వారా, టెక్నీషియన్లు పనిచేసి వెళ్ళిన అనంతరం జరిగే డ్యామేజీలపై ఖచ్చితమైన సమాచారం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జవాబుదారీతనం కోసం ఐడీ కార్డుల పద్ధతి ఎంతో ఉపయుక్తమైనదని వారు అభిప్రాయపడ్డారు. కొంతమంది వాణిజ్య ప్రకటనల ద్వారా టెక్నీషియన్ల అవతారం ఎత్తుతున్నారనీ, అలాంటివారికి కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ఇబ్బందలు తలెత్తుతున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటివాటన్నిటికీ ఐడీ బ్యాడ్జీల ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. లీగల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్‌లో ప్యానెల్ నెంబర్స్, ఐడీ కార్డులో వర్కర్‌కి సంబంధించిన స్కిల్స్, అలాగే అతని ప్రొఫెసన్ వివరాలు పేర్కొనేలా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. సిఎంసి రికమండేషన్స్‌ని మినిస్ట్రీ వెల్కమ్ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









