దారితప్పిన విమానం, తృటిలో తప్పిన పెను ప్రమాదం

- February 01, 2017 , by Maagulf
దారితప్పిన విమానం, తృటిలో తప్పిన పెను ప్రమాదం

దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం వెళ్లవలసిన ఇండిగో విమానం ఒకటి విమానాశ్రయంలో దారి తప్పింది. అప్పటికే ఆ మార్గంలో జెట్ ఎయిర్‌వేస్ విమానం నిలిచి ఉంది. సకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తం చేయడంతో ముప్పును నివారించగలిగారు. ఇండిగో విమానం 6ఇ 719కు 28వ రన్ వే కేటాయించారు. 'సి' లేన్ ద్వారా ఆ విమానం రన్‌వేపైకి రావాలి. రన్‌వేను దాటి డబ్ల్యూ లేన్‌లోకి వెళ్లిపోయినట్లు కమాండర్ గుర్తించారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా అప్రమత్తం చేయడంతో కమాండర్ విమానాన్ని తక్షణం నిలిపివేశాడు. మంచు కారణంగా సరిగా కనిపించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఇండిగో చెబుతుండగా, రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటనతో పలు విమానాలు గంట పాటు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com