పంకజ్‌ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర ...

- February 02, 2017 , by Maagulf
పంకజ్‌ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర ...

జాతీయ స్నూకర్‌ టైటిల్‌ కైవసం
న్యూఢిల్లీ: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ స్నూకర్‌ చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడం ద్వారా ఏకకాలంలో జాతీయ స్నూ కర్‌, బిలియర్డ్స్‌ టైటిళ్లను గెల్చుకున్న అత్యంత అరుదైన ఆటగాడిగా పంకజ్‌ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ ఏడాది పంకజ్‌... బిలియర్డ్స్‌, 6-రెడ్‌ స్నూకర్‌, 15-రెడ్‌ స్నూకర్‌ పోటీల్లో టై టిళ్లను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో పంకజ్‌ 6-0తో పాండురంగయ్య (రైల్వేస్)ను చిత్తుచేసి కెరీర్‌లో 29వ జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com