మరో యూత్ మల్టీ స్టారర్...
- February 05, 2017
టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు, ఆదిలు కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట.
సుదీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్ ను రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ భారీ మల్టీ స్టారర్ లో నటించేందుకు నలుగురు హీరోలు ఒకే చెప్పేశారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









