టాప్‌ టాలెంట్‌ కోసం కొత్త వీసా విధానం

- February 06, 2017 , by Maagulf
టాప్‌ టాలెంట్‌ కోసం కొత్త వీసా విధానం

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం, కొత్త వీసా విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. మెడిసిన్‌, సైన్స్‌ మరియు రీసెర్చ్‌ విభాగాల్లో 'టాప్‌ టాలెంట్‌'ని తీసుకొచ్చేందుకుగాను వీసా విధానంలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ వెల్లడించారు. యూఏఈలో వివిధ రంగాలకు చెందినవారికి విశేషమైన అవకాశాలు లభిస్తున్నాయనీ, కొన్ని రంగాల్లో టాప్‌ టాలెంట్‌ని ఎట్రాక్ట్‌ చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ, క్యాబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చ జరిగిందని సోషల్‌ మీడియా ద్వారా షేక్‌ మొహమ్మద్‌ వెల్లడించారు. ప్రస్తుత చట్టం ప్రకారం వలసదారులకు యూఏఈ శాశ్వత నివాసాన్ని ఆఫర్‌ చేయడంలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com