పార్‌టైమ్‌ కొత్త రూల్‌: పని గంటల పరిమితి

- February 07, 2017 , by Maagulf
పార్‌టైమ్‌ కొత్త రూల్‌: పని గంటల పరిమితి

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాన్‌ పవర్‌, పార్ట్‌ టైమ్‌ వర్క్‌కి సంబంధించి నిబంధనల్ని సవరించింది. తాజా నిర్ణయంతో, పార్ట్‌ టైమ్‌ వర్క్‌ అంటే నాలుగు గంటలకు మించి కాకూడదు. వారంలో ఈ పని దినాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 25 గంటలు దాటకూడదు. గతంలో ఇది రోజుకి ఐదు గంటలు కాగా, వారానికి పరిమితి లేకుండా ఉంది. తాజా మినిస్టీరియల్‌ డెసిషన్‌ నెం 40/2017, జనవరి 26న విడుదలయ్యింది. మినిస్టర్‌ ఆఫ్‌ మ్యాన్‌ పవర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ నాజర్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ బక్రి ఈ డెసిషన్‌ని విడుదల చేయడం జరిగింది. ఇంకో వైపున పని గంటలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్న లిమిట్‌ని మాత్రం మార్చలేదు. పార్ట్‌ టైమర్స్‌ సంఖ్యను 20 శాతానికి నిర్ధారించారు. ఈ లిమిట్‌ గతంలో 10 శాతంగా ఉండేది. పార్ట్‌ టైమర్‌, ఖచ్తిచంగా ఎంప్లాయ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ని ఎంప్లాయర్‌ నుంచి పొందవలసి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com