బాలుడి మృతి: 49,000 బహ్రెయినీ దినార్స్‌ ఎక్స్‌గ్రేషియా

- February 07, 2017 , by Maagulf
బాలుడి మృతి: 49,000 బహ్రెయినీ దినార్స్‌ ఎక్స్‌గ్రేషియా

మనామా: బహ్రెయినీ న్యాయస్థానం ఓ ప్రైవేట్‌ స్కూల్‌, 49,000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృతికి కారణమయ్యిందన్న ఆరోపణల మేరకు స్కూల్‌ యాజమాన్యం ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. 2013 సెప్టెంబర్‌ 19, మండు వేసవిలో ఐదేళ్ళ విద్యార్థి అల్‌ రువాబి బస్‌లో లాక్‌ అయిపోయాడు. ఉష్ణోగ్రతను తాళలేక, ఊపిరి అందక ఆ విద్యార్థి మృతి చెందాడు. బస్‌లోంచి విద్యార్థులందరూ దిగిపోయాక బస్‌ సిబ్బంది అందులో రషీద్‌ ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఈ కేసులో డ్రైవర్‌ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యాడు. టీచర్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది. బస్‌ సూపర్‌ వైసర్‌కి ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com