విజయవాడ రైల్వేస్టేషన్‌కి మహర్దశ పట్టనుంది...

- February 07, 2017 , by Maagulf
విజయవాడ రైల్వేస్టేషన్‌కి మహర్దశ పట్టనుంది...

మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు. 
నేడు దిల్లీ నుంచి ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేష్‌ప్రభు 
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌కి మహర్దశ పట్టనుంది. విమానాశ్రయ తరహాలో త్వరలోనే ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ఆలస్యమైనా ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్‌లు, షామింగ్‌ మాల్స్‌, ఐదు నక్షత్రాల తరహా హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ ప్రాంగణాలను వినోద, వాణిజ్య కేంద్రాలుగా విస్తరించేందుకు 'స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు'ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి వెబ్‌సైట్‌లో టెండర్ల ప్రక్రియను రైల్వే మంత్రి సురేష్‌ప్రభు బుధవారం దిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ సమీపంలో రాయనపాడు, సత్యనారాయణపురం, సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న విలువైన రైల్వే స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగించనున్నారు. . మల్టీఫంక్షనల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రైల్వేస్టేషన్‌ ముఖద్వారం ఆవరణలోని స్థలాన్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. తారాపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇప్పుడున్న హోటళ్లతో పాటు రైల్వేస్టేషన్‌ ఒకటో నెంబరు, 6,7, 9,10 స్టేషన్లలో ఆదనంగా ఏసీ డార్మెటరీలు, సినిమాలు వీక్షించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com