బోస్టన్ బయలుదేరిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
- February 08, 2017
వరస సినిమా పనుల్లో, రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బోస్టన్ బయలుదేరివెళ్ళినట్లు సమాచారం. ఫిబ్రవరి 11న బోస్టర్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 2017 ఇండియా కాన్ఫెరెన్స్ లో భాగంగా అక్కడ విద్యార్ధులను ఉద్దేశించి పవన్ పసంగించనున్నారు.. యూఎస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు కొద్ది రోజుల క్రితమే హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రసంగించాలని యూనివర్సిటీ సభ్యులు గౌరవ ఆహ్వానం పంపిన సంగతి విధితమే.. కాగా ఇదే ఆహ్వానాన్ని పవన్ స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా అందుకొన్నారు.. ప్రపంచ స్థాయిలో ప్రసిద్ది గాంచిన అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో గొప్పవారిగా పేరుగాంచిన జూకర్ బర్గ్, జాన్ కెన్నాడీ, ఒబామా వంటి వారు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు..కాగా ఈ యూనివర్సిటీలో ప్రసంగించగానికి దక్షిణాది నుంచి కమల్ హాసన్ ఆహ్వానం అందుకొన్న సంగతి విధితమే.. కమల్ తర్వాత ఆ ఘనత పవన్, త్రివిక్రమ్ ద్వాయానికి దక్కడం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







