సినిమా కోసం తీసుకొన్న రెమ్యునరేషన్ ని ఆ నిర్మాతకు తిరిగి ఇచ్చిన..
- February 08, 2017రాఘవ రాఘవేంద్ర లారెన్స్ హీరోగా సాయి రమణి దర్శకత్వంలో "మెట్ట శివ కెట్ట శివ" చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. కానీ ఈ సినీ నిర్మాతకు ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడడంతో రిలీజ్ చెయ్యడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు.. దీంతో లారెన్స్ స్పందించి తాను ఈ సినిమా కోసం తీసుకొన్న రెమ్యునరేషన్ ని ఆ నిర్మాతకు తిరిగి ఇచ్చి.. ఆర్ధిక సమస్యలను తప్పించి సినిమా రిలీజ్ కావడానికి మార్గం ఏర్పరచాడు.. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అని డేట్ ప్రకటించుకొన్నది.. కాగా లారెన్స్ మంచి మనసుతో మరో సారి వార్తల్లో నిలిచాడు.. నిర్మాత పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకొని తన ఉదార స్వభావాన్ని చాటాడు.. లారెన్స్ కు జోడీగా నిక్కీ గల్రాని నటించగా.. సత్య రాజ్ కీలక పాత్రలో నటించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







