కక్ష్యలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలు...

- February 08, 2017 , by Maagulf
కక్ష్యలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలు...

అనుకున్న సమయం రానే వచ్చింది.  సైంటిస్టుల పరిశోధనలు విజయవంతమయ్యే రోజు రాబోతుంది. భాతర అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది.  ఈ అపురూప దృశ్యాన్ని ఈ నెల 15న చూడబోతున్నాం.  1500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలను 320 టన్నుల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ37) సౌరకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.  గత ఏడాది జూన్ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డును నెలకొల్పిన భారత్ ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది.  2014లో రష్యా 37 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే పెద్ద రికార్డు.  ఇప్పుడు ఆ రికార్డును భారత్ బ్రేక్ చేయబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com