మక్కాలో ఆత్మహత్యకు యత్నం చేసిన వ్యక్తిని రక్షించిన సౌదీ దళాలు...

- February 08, 2017 , by Maagulf
మక్కాలో  ఆత్మహత్యకు యత్నం చేసిన వ్యక్తిని రక్షించిన సౌదీ దళాలు...

జెడ్డా :ఇస్లాంను అనుసరించే ప్రతిఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారయినా పవిత్ర మక్కాను దర్శించాలని కోరుకుంటారు.సౌదీలో ఉండే మక్కా మసీదును దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు వస్తుంటారు. భక్తిభావంతో ముస్లింలందరూ వెళ్లే మక్కాకు.. ఆత్మహత్య చేసుకోవాలని పక్కా ప్రణాళికతో వెళ్లాడో ఓ వ్యక్తి . మక్కాలో సోమవారం 11 గంటలప్పుడు ప్రార్థనలు చేస్తుండగా, రద్దీలో అటూ ఇటూ అందరూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ  40 ఏళ్ళ వ్యక్తి తన వద్ద ఉన్న బాటిల్‌లో పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకోవడానికి ప్రయత్నించాడు. అది గమనించిన సౌదీ దళాలు మిగిలిన వారు అతడిని పట్టుకుని అతని ప్రయత్నాన్ని నిరోధించారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా.. పవిత్రమైన మక్కాలో ఘోరం జరిగిపోయి ఉండేది. పోలీసులు అతడిని జైలుకు తరలించి విచారణ జరుపుతున్నారు. ప్రత్యేక దళాల మీడియా ప్రతినిధి మేజర్ రెడ్  సామెహ్ అల్ సులమై ఈ ఘటన పై మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం సరిగా లేని ఒక వ్యక్తి దుస్తులపై ద్రవ రూపంలో ఉన్న గాసోలిన్ చల్లుకొని  తనకు తాను స్వయంగా నిప్పంటించుకున్నాడు..దీనితో అతడ్ని  కాబా సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. మానసిక అనారోగ్యం సరిగా లేనట్లుగా భావిస్తున్న ఆ వ్యక్తికి కుటుంబ కలహాలతో విసిగిపోయే అతడు ఇలా ప్రవర్తించి ఉంటాడని యాత్రికులు చెప్పుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com