ఫేక్ గూడ్స్: ఇద్దరు ఆఫ్గానీల అరెస్ట్ ...
- February 08, 2017
సార్జా పోలీసులు ఇద్దరు ఆఫ్గానీలను పెద్ద మొత్తంలో అక్రమంగా గూడ్స్‌ని తరలిస్తున్నందుకుగాను అరెస్ట్ చేశారు. యూఏఈ చట్టాలకు వ్యతిరేకంగా వీరు ఫేక్ గూడ్స్‌ని తరలిస్తూ పట్టుబడ్డారు. ఇద్దరు నిందుతలకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిద్దరినీ అరెస్ట్ చేసింది. విచారణలో, తాము చేసిన నేరాన్ని నిందితులు అంగీకరించారు. కాస్మొటిక్స్ సహా పలు రకాలైన గూడ్స్‌ని వీరిద్దరూ తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. షార్జా నుంచి రీ-ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు విచారణలో నిందితులు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు వేర్హోస్పై దాడులు జరిపి ఫేక్ గూడ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్ని ప్రాసిక్యూషన్ కోసం రిఫర్ చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు సంబంధించి సామాన్యులు పోలీసులతో కలిసి పనిచేయాలనీ, ఏ చిన్న సమాచారం అక్రమ రవాణాకి సంబంధించి తెలిసినా ప్రజలు పోలీసులకు తెలపాలని డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీమ్ అల్ అజిల్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







