కర్వా డ్రైవర్‌ని తొలగించిన మౌవాసలాత్‌ ...

- February 08, 2017 , by Maagulf
కర్వా డ్రైవర్‌ని తొలగించిన మౌవాసలాత్‌ ...

కర్వా ట్యాక్సీ డ్రైవర్‌, తన కారుని పెడెస్ట్రియన్‌ మార్గంలో నడపడంతో అతన్ని విధులనుంచి తొలగిస్తున్నట్లు మౌవాసలాత్‌ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటి ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా క్యాబ్‌ డ్రైవర్‌ని విధుల నుంచి తొలగించారు. అయితే డ్రైవర్‌ ఎందుకు వాహనాన్ని అలా పాదచారుల మార్గంలో నడపాల్సి వచ్చిందనేదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని మౌవాసలాత్‌ వర్గాలు పేర్కొన్నాయి. దోహా కోర్నిచ్‌ ప్రాంతంలో కర్వా ట్యాక్సీ డ్రైవర్‌ తన వాహనాన్ని పాదచారుల మార్గంపై నడిపించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com