నవంబర్‌ నాటికి కొత్త ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌...

- February 10, 2017 , by Maagulf
నవంబర్‌ నాటికి కొత్త ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌...

కువైట్‌: కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ నవంబర్‌ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ యావియేషన్‌ (జిఎసిఎ) తెలిపింది. జిఎసిఎ ఛైర్మన్‌ షేక్‌ ముబారక్‌ సలీమ్‌ అల్‌ సబా మాట్లాడుతూ, కువైట్‌ ప్రధాన విమానాశ్రయంపై ప్రయాణీకుల రద్దీ తగ్గించేందుకుగాను ఈ కొత్త టెర్మినల్‌ ఉపయోగపడ్తుందని అన్నారు. ప్రస్తుతానికి 30 శాతం టెర్మినల్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారాయన. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉత్తరం వైపున ఈ కొత్త టెర్మినల్‌ని రూపొందిస్తున్నారు. ఇందులో 14 డిపాచూన్ర గేట్స్‌, 5 మిలియన్‌ ట్రావెలర్స్‌కి సేవలందిస్తుందని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com