చికెన్ మిర్చీ బజ్జీ...
- February 11, 2017
కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, మిరపకాయలు (బజ్జీకాయలు) - 10, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టీ స్పూన, కరివేపాకు - ఒక రెమ్మ, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, మైదా - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు.
తయారీ పద్ధతి: కుక్కర్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో పసుపు, కారం, గరం మసాలా, చికెన్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక దింపేసి చల్లారనివ్వాలి. తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్ళు పోసి చపాతీపిండిలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అద్దుకొని కలిపితే పిండి మృదువుగా వస్తుంది. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీలా వత్తాలి. తర్వాత పూరీని కత్తితో సన్నసన్నని రిబ్బన్లుగా కట్ చేయాలి. మిర్చీకి గాటు పెట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని నింపాలి. ఇలా నింపిన మిర్చీని కట్ చేసిన పూరీ రిబ్బన్ల మీద ఉంచి రోల్ చేయాలి. దీనిని నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.)
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









