'రోగ్‌'.. ఇది మరో చంటిగాడి ప్రేమకథ...

- February 14, 2017 , by Maagulf
'రోగ్‌'.. ఇది మరో చంటిగాడి ప్రేమకథ...

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'రోగ్‌' అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇషాన్‌ ఈ చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్‌ అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేమ కోసం తలకిందులుగా వేలాడే ప్రేమికులకు శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు. పోస్టర్‌లో హీరో తలకిందులుగా వేలాడుతున్నారు. 'రోగ్‌' అనే టైటిల్‌ ఉన్న ఈ చిత్రానికి మరో చంటిగాడి ప్రేమకథ అనే ఉపశీర్షికను జత చేశారు. సునీల్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com