చైనా బొగ్గుగనిలో భారీ పేలుడు..
- February 14, 2017
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 9 మంది దుర్మరణం పాలయ్యారు. లియాన్యుయాన్ నగరంలోని జుబావో బొగ్గు గనిలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అధికారిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. పేలుడు జరిగిన సమయంలో గనిలో 29 మంది విధుల్లో ఉన్నారు. వీరిలో 16 మంది తప్పించుకోగలిగారు. మరో నలుగురిని రెస్క్యూ బృందం రక్షించింది. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









