వీరిద్దరి కాంబినేషన్‌లో తదుపరి సినిమా...

- February 15, 2017 , by Maagulf
వీరిద్దరి కాంబినేషన్‌లో తదుపరి సినిమా...

ఇ టీవలే నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంతో అభిమానుల్ని అలరించారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా రాజసం ఒలికించారు.. సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేశారు. బాలయ్య కెరీర్‌లోనే ఓ మరపు రాని విజయమది. తదుపరి సినిమాలోనూ అదే జోరు కనిపించాలని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కథ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు బాలకృష్ణ. ఆయన ఇంటి ముందు దర్శకుల క్యూ ఉన్నా, కొన్ని కథలు ఆయన్ని ఆకట్టుకొన్నా.. తదుపరి సినిమా విషయంలో ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్నుంచి 101వ చిత్రానికి సంబంధించిన వార్తలేం రాలేదు.
అయితే శ్రీవాస్‌ చెప్పిన ఓ కథ బాలయ్యకు బాగా నచ్చిందని, తదుపరి సినిమా అదే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్‌లో ఓ టాక్‌ వినిపిస్తోంది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డిక్టేటర్‌’ వచ్చి అభిమానుల్ని అలరించింది. ఈసారి మరింత కొత్త కథతో బాలయ్యని సంప్రదించారట శ్రీవాస్‌. అతి త్వరలో ఈ సినిమాపై బాలయ్య ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com