' ఘాజీ ' ప్రీమియర్ షో టాక్...
- February 15, 2017
దగ్గుపాటి రానా హీరో గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో పీవీపీ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో రెండు రోజుల ముందే చిత్ర ప్రీమియర్ షో ను వేశారు నిర్మాతలు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ లో ఈ మూవీ ని కొంతమంది సినీ ప్రముఖులు వీక్షించారు.
మొదటి సినిమా అయిన కానీ సంకల్ప్ రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించాడని , 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథ గా ఘాజీ తెరకెక్కింది. సినిమా అంతా ఒక్క సబ్ మెరైన్ తో సాగుతుంది..సినిమా చూసినంత సేపు మనమే ఆ యుద్ధం లో ఉన్నామా అనేంతగా అనిపిస్తుంది..
ఇక నటి నటుల విషయానికి వస్తే.. కేకే మీనన్ రోల్ సినిమాకు ప్రాణం పోసింది. ఆలోచన , సమయాన్ని బట్టి ఆవేశ కెప్టెన్ గా అతని యాక్టింగ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా అదరగొట్టాడు. అధికారుల ఆదేశాలను పాటించే సిన్సియర్ అధికారిగా, దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని యోధుడిగా రానా కనిపించి మూవీ సక్సెస్ లో పాలుపంచుకున్నాడు. తాప్సీ, నాజర్, ఓం పురిలు మిగతా వారి నటన కూడా బాగుంది. ఓవరాల్ గా ' ఘాజీ ' ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







