భార్య హత్య కేసులో భర్తకు మరణ శిక్ష ..
- February 15, 2017
షార్జా క్రిమినల్ కోర్ట్, ఆసియా జాతీయుడికి భార్యను హత్య చేసిన కేసులో మరణ శిక్ష విధించింది. మృతురాలి బంధువులు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడికి క్షమాభిక్ష ఇవ్వరాదని విజ్ఞప్తి చేయడంతో నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. హత్యకు సంబంధించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితుడు తన భార్యతో గొడవపడి, ఆ గొడవ కారణంగా భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ ఘటను చూసిన పొరుగువారు అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో నిందితుడు తానే తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







