వెండితెరపై ‘డాక్టర్‌ అబ్దుల్‌ కలాం’

- February 15, 2017 , by Maagulf
వెండితెరపై ‘డాక్టర్‌ అబ్దుల్‌ కలాం’

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా ‘డాక్టర్‌ అబ్దుల్‌ కలాం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇంగ్లిషులో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో.. నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ37ను ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్‌ చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు అని రాసి ఉంది.
అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com