'ఐపిఎల్-2017' షెడ్యూల్ విడుదల
- February 15, 2017
ఐపిఎల్-2017 షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలుకానుంది. అయితే మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. 47 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం పది వేదికలను ప్రకటించింది బీసీసీఐ. ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుండగా ఒక్కొక్కటి ఒక్కో స్టేడియంలో ఏడు చొప్పున గేమ్‌లు ఆడతాయి. అయితే మే 21న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా అది కూడా మన హైదరాబాద్ స్టేడియంలోనే జరగనుండటం విశేషం. ఈ ఎడిషన్‌లో ఇండో స్టేడియంలో కూడా ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపిఎల్ జట్లలో ఒక్క కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడాల్సిన హోం గ్రౌండ్ మ్యాచ్‌లలో నాలుగు మొహాలిలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







