అబుధాబీలో ఇళ్ళలో, వీధుల్లో జంతు వధ నిషేధం- 500 దీర్హమ్ ల జరిమానా

- September 18, 2015 , by Maagulf
అబుధాబీలో ఇళ్ళలో, వీధుల్లో  జంతు వధ నిషేధం- 500 దీర్హమ్ ల జరిమానా

ఈద్-అల్-అధా మొదటిరోజు ఈ నెల 24న జరుపుకుంటున్న సందర్భంగా, అబుధాబీ లోని జంతు వధ శాలలు తయారవుతున్నాయి. అబూ ధాబీ సిటీ మునిసిపాలిటీ (ADCM) - అనారోగ్య పరిస్థితులు మరియు పర్యావరణ సమస్యలకు దారితీసే విధంగా ఇళ్లల్లో, వీధులలో, కూడళ్లలో బలి ఇవ్వడాన్ని నిషేధించింది; ఈ నిబంధన అతిక్రమించిన వారికి 500 దీర్హమ్ ల జరిమానా మరియు సదరు జంతువు కూడా జప్తు చేయబడుతుందని కూడా హెచ్చరించింది. అధా మొదటి రోజున   జంతువులను బలి ఇవ్వడానికి, అబుధాబీ సామాజిక జంతు వధ శాల, బనీయాస్ జంతు వధ శాల,అల్-శమామా జంతు వధ శాల,అల్-వాత్బా జంతు వధ శాలలు ఉదయం 7 నుండి, సాయంత్రం 6 వరకు; మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుండి, సాయంత్రం 6 వరకు సిద్ధంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్ ఖలీఫా మొహమ్మద్ అల్ రుమైథీ తెలియజేశారు. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com